Thursday, October 15, 2020

40 వసంతాల వేడుక - చివరి రోజు

నిన్న రాత్రి ఆలస్యం (ఆలీసెం) గా నిద్రపోయాం కదా , అంచేత అంతా కాస్త ఆలీసెంగానే నిద్దర్లు లేచేం.

పిల్లలంతా బేస్మెంట్ లో అవిరామంగా, అవిశ్రాంతంగా ఆటలలో పడ్డారు. మళ్లీ ఎన్నాళ్ళకు ఈ అవకాశం వస్తుందోనని ఆ లేత మనసుల్లో ఒక ఆరాటం !.

కాఫీలు తాగేక పెద్ద వాళ్ళందరూ (దుర్గ, డాలీ, గాయత్రి, స్రవంతి, దివ్య, శ్రీలత మినహా) ‘టైమ్ పాస్ మోడ్’ లో ఎక్కడి వారక్కడే స్థిరోభవ !.

దుర్గ & టీమ్, వంట పనిలోనూ, సామానులు సర్దడం లోనూ తల మునకలు గా ఉన్నారు.

కిశోర్ మట్టుకు ‘సీనిక్ డ్రయివ్ త్రూ అపలాచియన్ మౌంటెన్స్’ కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి జడంగా ఉన్న అందరిని (నాతో సహా) తయారవమని ఉత్తేజపరుస్తున్నాడు.

అవును మరి.

చూడవలసిన గొప్ప ప్రదేశం. 

దూరాభారం.

కాళ్ళీడిస్తే ఎలా?

ఒకటికి పదిసార్లు చెప్పేక అందరూ భోజనాలకు లేచారు.

ఆనపకాయ (హరీష్ పెరటిలోవి) ఆవ పెట్టినకూర, సాంబార్, పచ్చిమిరపకాయ పచ్చడి, పెరుగు - మెనూలో.

అమృత పాకం !

ఇక కుమ్ముడే కుమ్ముడు !

ఆత్మారాముడు చల్లబడ్డాక అందరూ కొత్త ఉత్సాహం తో డ్రైవ్ కి బయలు దేరేం. మూడు కార్లలో.

60 మైళ్ళు ప్రయాణించి Robinsville (NC) చేరేము. కాస్త విరామం, కాసిని ఫొటోల తర్వాత పునః ప్రయాణం. ఇక్కడి నుండే అసలు drive మెదలు.

NC లోని (Chero)kee forest ని Tenesse లోని Nanthe(hala) forest తో అనుసంధానం చేసే ఈ త్రోవను ‘Cherohala’skyway అంటారు. దాదాపుగా 43 మైళ్ళు పొడవున్న ఈ మార్గం Appalachian కొండలలోంచి వెళుతుంది. పతాక స్థాయి 5400 అడుగులు.

ప్రకృతి అందాలకు సుందర నిర్వచనం!

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బోలెడు ఫోటోలు తీసుకున్నాము.

తీపి జ్ఞాపకాలు!.

Drive అయి పోయాక మరో 60 మైళ్ళు ప్రయాణం చేసి తిరిగి బస చేరుకున్నాము.

జీరా రైస్, ఆలూదమ్, ఉప్మా లతో రాత్రి భోజనం కానిచ్చాక చాలాసేపు గాన కచేరి నడిచింది.

DD sister’s జుగల్బంది joshful గా ఉంటే, father & son (Uday & Ricki) ‘s number ‘Tequila’ was a chart buster !

అందరూ అయిష్టంగానే లేచి వెళ్ళి నిద్దర్లు పోయారు.

మరునాడు...

మరో అందమైన రంగుల కలకు ఎదురు చూస్తూ అందరూ వారి వారి ఇళ్ళకు బయలు దేరేరు .

’జీవితంలో కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు బాధ కలగడం సహజం’

Cheer up!

ఫిర్ మిలేంగే !!



1 comment: