ఇది రాసేముందు చాలా ఆలోచించేను ; నేను రాయగలనా అని.
మనస్సు లోని భావాలు మన వాళ్ళతో పంచుకునేందుకు అవకాశం వచ్చినప్పుడు ఆలోచించడం ఎందుకు అనిపించింది.
ప్రపంచం అంతా COVID విలయ తాండవం చేస్తున్న ఈ సమయం లో మనం సాహస యాత్రే చేసేము !. దానికి పుష్కలంగా దేముని దయ, మా/మీ తల్లి తండ్రుల దీవెనలు, సంకల్ప బలం తో పాటు మనం చేసుకున్న detailed planning సహాయపడ్డాయి.
అక్కా తమ్ముళ్ళ కలయిక, బావ మరుదుల సరదాలు, మేనమామలు, పెదనాన్న, చిన్నాన్నల అనురాగాలు !
కలబోసిన సౌరభాలు !!
ఇటువంటి అరుదైన కుటుంబ కలయిక అమెరికాలో సాధ్య పడడం దేముడిచ్చిన వరం.
అందుకేనేమో మనం నిత్యం పూజలో ‘అస్మాకం సహ కుటుంబానాం’ అని సంకల్పం లో చెప్పుకుంటాం!
ఆత్మీయులతో ఉన్నత శిఖరాలు ఎక్కడంలో ఆనందపు అంచులు తాకిన అనుభవం కలిగింది. చిన్నారుల చేత కూడా కొండలెక్కించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించగలగడానికి నాంది పలకడమైంది. పిల్లలు కూడ ఏమీ అలుపు సొలుపు లేకుండా ఎక్కేసారు.
నా సొంత వాళ్ళందరూ నాతో ఉన్నారన్న భరోసా !
ఇటువంటి కలయికకు ఏ వసంతఋతువూ అఖ్ఖర్లేదు.
అవకాశం చాలు.
ఇంటి ఆడపిల్ల ఎక్కడున్నా అన్నదమ్ముల ఉన్నతి, ఆనందం కోరుకుంటుంది.
అందుకే మన సాంప్రదాయంలో ఆడపిల్లకు పెద్ద పీట వేసేరు. ఆదరించమన్నారు, ఆప్యాయత పంచమన్నారు,’ఈ ఇంటికి నువ్వే యువరాణివి’ అన్న భరోసా ఇవ్వమన్నారు.
స్వబంధువుని విడనాడడం వల్లే తన కు పతనం కలిగిందని రావణుడే అన్నాడు.
బంధుత్వాలను బలపరచుకుందాం,భద్రపరచుకుందాం !
మీ అందరితో ఈ మధురమైన అనుభూతులు పంచుకోగలగడం మా అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో మరెన్నో ఆనంద యాత్రలు చేయాలి అని మనసార కోరుకుంటున్నాము.
సర్వేజనాస్సుఖినోభవంతు !
No comments:
Post a Comment