Saturday, September 19, 2026

 *జై జననీ !* 

సెప్టెంబర్ నెల వస్తే భక్తి శ్రద్ధలతో పాటించే అమ్మ అనుష్టానం గుర్తుకొస్తుంది .

వినాయక చవితి తో నాంది !.

ఆతరువాత శరన్నవరాత్రులు, దేవీభాగవతపారాయణ, ముందొచ్చే ఎన్నో పండుగలు గుర్తుకొచ్చి అమ్మ ఉంటే ఎంత బావుండేదో అన్న ఊహ , ఇంకా లేదు కదా అన్న నిరాశల మధ్య నలుగుతున్న నా మనసు రోదిస్తుంది.

జీవితం లో ని అనుభవాలు మనస్సు ని కరడు  కట్టిస్తున్నా అమ్మ స్మృతులు నాలోని భావుకత ను పునరుజ్జీవింప చేస్తాయి.

శివుడు ఇలా ఢీలా పడిపోకూడదని కామోసు అమ్మ జుమా జెట్టీ ల్లాంటి అన్నయ్యలకి , మా అందరికీ అపురూపడైన ఒక తమ్మునికీ జన్మనిచ్చింది. 

ఇద్దరు అక్కల ఆప్యాయత బంగారానికి వెలిగారం !

ఒకరంటే మరొకరికి ప్రేమానురాగాలు మనసునిండా ఉన్నా ముఖతః వ్యక్తం చేసుకునే విద్య మా ఎవ్వరికీ రాదు అని నా ఉద్దేశ్యం . అంచేత అలాంటి 

భావాలన్నీ  అవ్యక్తం గా ఉండిపోయి హైపర్ టెన్షన్ కలగచేస్తున్నాయని నా అనుమానం.

పోతే ఒక మాటండోయ్ ! అమ్మ మాటొస్తే మాత్రం మేమంతా పొందే స్పందన మనస్సు ల కి గొప్ప స్వాంతన ఇస్తుంది.

ఆమాటకొస్తే ఎవ్వరికైనా వాళ్ళ అమ్మ అంతే !

అందుకే కదా ఆసేతు హిమాచల పర్యంతం అమ్మ కి పూజలు . నవరాత్రి తొమ్మిది రోజులూ తల్లి తలపే . 

అనురాగ మాలిక , అమృత వర్షిణి అవసరమైతే ఆదిపరాశక్తి - అమ్మ .

అదీ అమ్మ కి ఉన్న bandwidth !

ఎవడో ఇంగిలీషు వాడు అన్నట్టు "Because God can not be everywhere, He created mothers"

అంటే అమ్మ విషయానికొస్తే ఇంగిలీషు వాళ్ళు కూడా నిజమే మాట్లాడుతారన్న మాట !

జై జగజ్జనని 🙏🏻

No comments:

Post a Comment