Friday, July 23, 2021

భారతదేశపు అభివృద్ధి నివేదిక

సరిగ్గా74 ఏళ్ళ క్రితం మన దేశ పరిపాలన ఆంగ్లేయుల చేతుల్లోంచి కొందరు భారతీయుల చేతుల్లోకి వచ్చింది. దీన్ని స్వాతంత్ర్యం అనడానికి నాకెందుకో పూర్తిగా మనస్కరించటం లేదు.
సాధారణంగా ఆక్రమణ చేసిన దేశం ఆక్రమిత దేశాన్ని వదలి వెళ్ళిపోతున్నప్పుడు పాలనా యంత్రాంగాన్ని వారి ఇష్టాలకు అనుగుణంగా ఉండే 'తోలుబొమ్మ నాయకుల(puppet leaders)' చేతుల్లోకి వెళ్ళేట్టు చూసుకోడం సహజం.

1947 ఆగస్టు 15 నాడు భారతదేశం లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది అని నా ఉద్దేశ్యం.

దేశ ప్రజలని అజ్ఞానంలో ఉంచి వారి స్వాభిమానాన్ని తక్కువగా ఉంచే ప్రక్రియను కొనసాగించడం తమ బాధ్యత అని ఈ తోలుబొమ్మ పరిపాలకుల ఆలోచన.

వీళ్ళని 'ప్రజాస్వామ్య రాజులు/రాణీలు' అంటే తప్పులేదని నా ఉద్దేశ్యం.
వీళ్ళకి మళ్ళీ ఎంతోమంది వందిమాగదులు !
వీళ్ళని 'lutyens group' అని కూడా అంటున్నారు !

వీరి వ్యక్తిత్వమేమిటంటే 'ప్రజాస్వామ్య రాజులకు/రాణీల'కు దాస్యం చేయడం, మిగిలిన భారతీయుల మీద పెత్తనం చెలాయించడం.
ఈ రకం గా వారి వారి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగేలా చూసుకోవడం.
పరిపాలన అంటే సేవ కాదు, వ్యాపారం, అని నమ్మేవారు వీరందరూ.

'బర్బాద్ గులిస్తా కర్నేకోతో ఏక్ హి ఉల్లూ కా ఫీ థా
 యహ హర్ శాఖ్ పె ఉల్లూ బైఠాహై
  అంజామ్ ఎ గులిస్తా క్యా హోగా'

(వనం పాడు చెయ్యడానికి ఒక గుడ్లగూబ చాలు. ప్రతి కొమ్మ మీద గుడ్లగూబ ఉన్న ఈ వనం ఏమవుతుందో ?)
అన్న వెనకటి ఓ ఉర్దూ కవిగారి ఆవేదన నాకు ఈ దేశం పరిస్థితి తలచుకున్నప్పడు గుర్తొస్తూంటుంది.
మరి ఇన్నేళ్ల లో పరిపాలకులు ఏమీ చెయ్యలేదా అంటే 'లేదు'
 అనలేను.
చెయ్యగలిగినవే చేశారు. వాటిలో కొన్ని చెయ్య కూడని విధంగా కూడా చేశారు.
చెయ్యవలసినవి చెయ్యలేదు.
చెయ్య కూడనివి కూడా చేశారు.
ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుందేమోననిపిస్తోంది.
ఇప్పటి పరిస్థితులలో మన దేశం యొక్క బలాలు, బలహీనతలు, అవకాశాలు, బెదిరింపులు ఎలా ఉన్నాయంటే
బలాలు
1. జనాభా లో అధిక శాతం వృత్తి నైపుణ్యం కలిగిన, చవుకగా లభించే యువత.
2. పారిశ్రామిక ప్రగతి.
3.  విదేశీ పెట్టుబడులు(ఇవి పి.వి.నరశింహారావుగారి దూరదృష్టి)
బలహినతలు
1. కాలం చెల్లిన కార్మిక చట్టాలు.
2.  రాజకీయం చేయబడిన కార్మిక సంఘాలు.
3. మౌలిక వసతులు కావలసినంత లేకపోవడం (ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి)
అవకాశాలు
1.  వ్యాపారం లో పెరిగిన పోటీ తత్వం.
2.  భారతీయులు విదేశాలలో పెట్టుబడులు పెట్టడం.
3.  'మేక్ ఇన్ ఇండియా' ఆశయం.
బెదిరింపులు
1.  చైనా కవ్వింపు చర్యలు.
2.  దేశంలో అవినీతి.
సహజసిద్ధంగా భారతీయుల లో ఉండే నైతికత వల్ల ఏదో ఈ మాత్రమైనా సాధించగలిగామేమో!
కానీ దేశకాలమాన పరిస్థితులవల్ల నైతికత దెబ్బ తింటోంది

ఇది అన్నిటి కన్నా ప్రమాదమైన సమస్య !

ఇప్పుడు ఏమి చెయ్యాలి?

నా ఉద్దేశ్యం లో విద్యా వ్యవస్థ ను ప్రక్షాళన చెయ్యాలి.

ప్రతి భారతీయునికి ఒకే తరహ విద్య అందించాలి.

ఉచితం గా అందించాలి.

పాఠశాలలన్నీ సర్కారు వారే నిర్వహించాలి. అమెరికాలో ఉన్న మన బంధువుల పీల్లల్లో ఎక్కువ శాతం 'పబ్లిక్ స్కూళ్ళ కే వెళుతున్నారు. 'స్పెల్లింగ్ బి' అయితేనేంటి 'మేథ్స్ ఒలింపియడ్' అయితే నేంటి అన్నింటా వీరు ముందే ఉంటున్నారు !

పాఠ్యాంశాలు స్వాభిమానం పెంచేవిగా ఉండాలి.

పదవ తరగతి వరకూ ఆటలూ, పాటలూ తప్పనిసరి చెయ్యాలి.

విద్యా విహారయాత్రలు కూడా చేర్చాలి. దీనివల్ల దేశం గొప్పతనం తెలుస్తుంది.. దేశభక్తి, ఐక్యతాభావం పెంపొందుతాయి.
మనలో ఎంతమందికి ఈ దిగువ విషయాలు బోధించబడ్డాయి?
1.నమస్తే (అంజలి) ఎందుకు చేస్తాము ?
2.ఓం కారం వల్ల ఉపయోగమేంటి ?
3.79° (తూర్పు రేఖాంశం) లో ఉన్న 25 హిందూ దేవాలయాల వశేషాలు.
4.షడ్దర్శనాలు (సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస/వేదాంత)
5.అష్టాంగయోగ
6.మొదటి ఎనిమిది భారతీయ విశ్వ విద్యలయాలు
7.ఎనిమిది భారతీయ నాట్యశాస్త్ర పద్ధతులు.
8.సూర్య సిద్ధాంతం.
9.సంస్కృతం.
10.కానడ, ఆర్యభట్ట, శుశ్రుత ఇత్యాది ఋషులు చెప్పిన సిద్ధాంతాలు. అలాగే
11.మన శాస్త్రాలలో చెప్పిన  
      అ. కాంతికన్నా వేగంగా ప్రయాణం.
      ఆ. సమానాంతర జగత్తు.
       ఇ. విశ్వం యొక్క మూలం.
       ఈ. జీవజాతుల సంఖ్య  వగైరా
నేనైతే ఇలాంటివి ఏ పాఠశాలలోనూ నేర్చుకోలేదు.
విదేశీయులు నేర్చేసుకుంటున్నారు.

హెచ్చరిక గంటలు బిగ్గరగా మ్రోగుతున్నాయి!!

మన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తే మన దేశానికి ఉన్న బలహీనతలు నిర్మూలించబడి మానవత్వం మళ్ళీ వెల్లివిరిస్తుంది.

అప్పుడు అభివృద్ధి స్వయంచాలికంగా వస్తుంది
   
 ....'Chak de India'