Monday, October 12, 2020

'గాయత్రి కొరిమిల్లి 40 వసంతాల వేడుక'

గాయత్రి '40 వసంతాలు' పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక చేసుకునేందుకు మేమంతా 'నార్త్ కేరొలినా' లోని 'మర్ఫీ నగరానికి తరళి వెళ్ళేము.

* 780 మైళ్ళు ప్రయాణం చేసి 'కేన్సస్' నుండి ఉదయ్ , డాలీ , రికీ మరియు ఈషన్ లు!.
* 940 మైళ్ళు ప్రయాణం చేసి 'హూస్టన్' నుండి విజయ్ , స్రవంతి , రేయాంష్ మరియు రిషిక్ లు!.
* 580 మైళ్ళు ప్రయాణం చేసి 'పిట్స్బర్గ్' నుండి హరీష్ , శ్రీలత మరియు విదుర్ శ్రీ రామ్ లు!.
* 580మైళ్ళు ప్రయాణం చేసి ' ఓర్లేండో' నుండి కిశోర్ , గాయత్రి , శ్రేయస్ మరియు శౌర్యలు!.
 వారితో పాటే నేనూ , దుర్గ.
* అదే ఊరినుండి చైతన్య , దివ్య , నైనిక మరియు రివాన్ లు!.

అందరి మధ్య ఉన్న ఆన్యోన్యత , ఆత్మీయత లని చూసి కామోసు ప్రకృతి పులకించి రంగులు సంతరించుకుంది!.

మర్ఫీ మహానుభావుడు మా కోసమే అన్ని హంగులూ , అందాలు పొందుపరచీ ఈ నగర నిర్మాణం చేసేడనిపించింది.
మేము బస చేసిన 'sleepy bear lodge' పరిసరాలు భూతల స్వర్గాన్ని తలపించేలా ఉన్నాయి!.
 'కన్సాస్'వారు , 'పిట్స్బర్గ్'వారు , మేమూ బుధవారం (10/7/'20) సాయంత్రానికి బసకు చేరుకున్నాము. 
'హూస్టన్' వారు , చైతన్య వారూ గురువారం రాత్రి కి చేరుకున్నారు.
బసలో అన్ని ఏర్పాట్లు, హంగులూ ఉన్నాయి.
Air hockey, table tennis, pool, chess లాంటి ఆటలతో సహా.
మొదటి రోజు అంటే బుధవారం అన్నీ సర్దుకొని రాత్రికి బంగాళదుంప వేపుడు , చారు , పెరుగులతో dinner కానిచ్చి నిద్దర్లు పోయేము.  
to be continued

No comments:

Post a Comment