Sunday, October 18, 2020

40 వసంతాల వేడుక - ముక్తాయింపు

ఉరుకు పరుగులతో గడిపే మన ఈ యాంత్రిక జీవనం లో నా వాళ్ళ తో మర్ఫీ లో గడిపిన ఆ నాలుగు రోజుల విహారయాత్ర ఎంత బావుందో !
చలికాలంలో లేత ఎండలాగా , మనసు దాహాన్ని తీర్చే కౌముది లాగా , ఎండాకాలం లో చిరుజల్లు లాగా , లేదూ ?
నా వాళ్ళ వల్లే నేను !
నా వాళ్ళ ఆత్మీయత చల్లటి మబ్బు పింజెల్లాగా , నిశ్శబ్దంగా విరిసే పూరేకుల్లాగా , రాలే పారిజాతాల్లాగా , సింహాచలం సంపెంగల్లాగా , మత్తెక్కించే మనోరంజనాల్లాగా , గుత్తులుగా వేళ్ళాడే రాధామనోహరాల్లాగా మనసుని అహ్లద పరచింది.
ఎంతో సాంత్వన కలిగింది.
ఉన్న ఆ నాలుగు రోజులూ ఊసులాడుకున్నాం , పంచుకున్నాం , పాటలు పాడుకున్నాం , కలసి ఉన్నాం , కలసి తిన్నాం , కలసి ఆడుకున్నాం , అల్లరి చేసేం !
That is the magic of a family get together !
మరచిపోదామన్నా మరువలేని అనుభూతులు !

సుదర్శన్ ఫాకీర్ గారనే ఓ కవి అన్నట్టు

"భులాయే నహీ భూల్ సక్తా హై కోయి
  వొ ఛోటీసి రాతేం , వొ లంబీ కహనీ !"

విదుర్ తో మొదలు పెట్టి నైనికా దాకా లెఖ్ఖ పెడితే ఎనమండుగురు - అష్ట దిగ్గజాలు !
వినయ సంపన్నుడు , కాలేజీ విద్యార్ధి అయిన మరో మనవడు రిక్కీ ని కూడా లెఖ్ఖ లో కలిపితే తొమ్మండుగురు - నవ రత్నాలు !!
ఈ ముక్కే దుర్గ కూడా అంది నాతో.
నాలుగు రోజులు మన ఊరు కాని ఊర్లో ఉన్నాము. ఏనాడైనా ఏ చిన్న వాడైనా (చంటివాడు విదుర్ తో సహా) ఓ పేచీ పెట్టలేదు , ఓ అల్లరి పని చెయ్యలేదు.
గమనించేరా ?
మంచి సంస్కారం !
తల్లిదండ్రులు అభినందనీయులు !
వాళ్ళ చేతలన్నీ ఎంతో ముద్దుగా ఉండే వి
To quote a few
* Vidhur trying to play TT with a basket ball and nonchalantly performing on centre stage
* Shourya running up like 'Rawalpindi express' just to deliver a slow one like Shane warme
* Rishik charming every one with his songs and wit
* Riwan singing American songs 'Believer' & 'thunder' , teaming up with Rishik
* Reyansh trying to emulate Michael Jordon
* Eshaan baking cakes like a master chef
* Shreyas' reminding us all of Arjit singh with his singing of 'Bolna , mahi , bolna'
* Multi talented Nainika enthralling everyone with her baking skills , cricketing talent and her soulful singing ,in particular, the 'titanic'
* Riki' coming from behind to steal the show with  'Tequila'
రాస్తున్న కొద్దీ గుర్తు కొస్తున్నాయి. 
ఒకటా , రెండా ?
ఎన్నో మధురానుభూతులు. 
దుర్గ చేసిన రవ్వలడ్డూల్లాంటివి !
 సౌరభాల కలబోత!

Let me end this with what Barney sings about 'family'
'Oh, a family is people and a family is love. That's family.
They come in all different sizes and different kind.
But mine is just right for me !'



No comments:

Post a Comment